NationalNews

ఈడీ ఏం చేసినా అది రాజ్యాంగబద్ధమే… ప్రశ్నలు అక్కర్లేదు

Share with

ఆర్థిక నేరాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసే విచారణలు రాజ్యాంగ సమ్మతమేనంటూ సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అరెస్టులు, జప్తు, సోదాల్లో సంస్థ తీరు సమర్థనీయమేనంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, (PMLA) 2002 కింద చేస్తున్న అరెస్టులు, ఆస్తుల స్వాధీనం విషయంలో ఈడీ అధికారుల తీరును అంగీకరించాల్సిందేనంది. దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై మనీలాండరింగ్ వ్యవహారాలు పెను ప్రభావం చూపిస్తున్నాయని కోర్టు చెప్పింది. ప్రతి కేసులో నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు నివేదిక కాపీని అందించాల్సిన అవసరం లేదంటూ తేల్చిచెప్పింది. PMLA రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ… కాంగ్రెస్ ఎంపీ చిదంబరం కార్తీతోసహా మరికొందరు దాఖలు చేసిన… 240 పిటిషన్లపై జస్టిస్ ఎంఎం ఖాన్ విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సి.టి. రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం 545 పేజీల తీర్పును వెలువరించింది.