Telangana

చికోటి కేసులో దూకుడు పెంచిన ఈడీ .. సోమవారం నుండి ప్రముఖుల విచారణ

Share with

క్యాసినో కేసులో విచారించే కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. వీరిలో కొందరు ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలను ఈడీ విచారిస్తున్న క్రమంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నాలుగు రోజులుగా దూకుడు పెంచిన ఈడీ అధికారులు అనేక విషయాలను రాబట్టే పనిలో పడ్డారు. చికోటితో కొంతమంది వీఐపీలు జరిపిన చాటింగ్‌ అంశాలను గుర్తించడంతో పాటు.. . అతని వాట్సాప్‌లో డేటా మిస్ అయినట్లు తెలుసుకుని, డేటా రిట్రీవ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాట్సప్ చాట్‌లో లావాదేవీలు జరిపిన ప్రముఖులను ఈడీ అధికారులు గుర్తించారు.

నేపాల్‌కు వెళ్లిన వారి వివరాలు, వారిలో ఎంతమంది ప్రముఖులు ఉన్నారన్నది నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. ప్రవీణ్ స్టేట్‌మెంట్ ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలను కూడా విచారించేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్త్తంయవహారంలో మొత్తం 16 మంది ఎమ్మెల్యేలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అనేక మంది రాజకీయ నాయకుల బండారాలు కూడా బయటపడుతున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖులను సోమవారం నుండి విచారించేందుకు ఈడీ సన్నద్ధమవుతోంది.