నీతి ఆయోగ్ కౌన్సిల్ మీట్ కు సీఎం జగన్
రెండు రోజుల పాటు ఏపీ సీఎం బీజీబీజీ. ఇవాళ తాడేపల్లి లోని నివాసం నుండి ఈ మధ్యాహ్నం బయలుదేరిన ఆయన ముందుగా ఆముదాల వలస చేరుకుని తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరయ్యారు. స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఆముదాలవలస నుంచి సీఎం జగన్ విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి శంషాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్‌లో జరిగే జీవీ ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహవేడుకల్లో పాల్గొంటారు. ఆ కార్తయక్రురమం అనంతరం శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఆ సమావేశానంతరం సాయంత్రం 5:30 కు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.