నాకు ప్రాణహని ఉంది: చికోటి ప్రవీణ్
క్యాసినో వ్యవహరంలో నాలుగో రోజు చికోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించింది. అనంతరం చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. విచారణ కొనసాగుతుందని ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని తెలిపారు. సోషల్ మీడియాలో నా పేరుతో ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చికోటి ప్రవీణ్ వాపోయారు. తనపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు…తనకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని హైకోర్టు లో రిట్ పిటిషన్ వేశానని చికోటి ప్రవీణ్ వెల్లడించారు..తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని , ఇక పై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని వివరించారు. చాలామంది రాజకీయ నాయకుల తో సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని వెల్లడించారు..క్యాసినో బిజినెస్ చేశానన్న ప్రవీణ్ అందులో తప్పేముందని సమర్థించుకున్నారు. విచారణ అంతా పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని చికోటి ప్రవీణ్ స్పష్టం చేశారు.