మరోమారు రక్తసిక్తమైన కాబూల్..
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోమారు రక్తమోడింది. శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లోని అతిపెద్ద మైనారిటీ వర్గమైన హజారాస్ ను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఈ దాడికి పాల్పడింది. ప్రార్థనల కోసం వచ్చిన మహిళలు, చిన్నారులను టార్గెట్‌గా చేస్తూ ఈ దారుణానికి ఒడి కట్టింది.
ఈ క్రమంలోనే ఉగ్ర సంస్ధ రెండు పేలుళ్ళకు పాల్పడింది. సర్-ఇ-కరిజ్ ప్రాంతంలోని ఇమామ్ బాకిర్ మసీదుతో పాటు మరోచోట పేలుళ్ళుకు పాల్పడ్డారు. ఈ ఘటలో 8 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతుండగా, చనిపోయింది 20 మందని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది.