NationalNews

రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

Share with

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం రేపు ఉదయం జూలై 25, 2022న ఉదయం 10:15 గంటలకు పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఛైర్మన్, ప్రధాన మంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు, ఎంపీలు, త్రివిధిదళాదిపతులు హాజరుకానున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్సవ సెంట్రల్ హాల్‌కు చేరుకుంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత కొత్త రాష్ట్రపతికి గౌరవ సూచకంగా 21-గన్ సెల్యూట్ చేస్తారు. అనంతరం రాష్ట్రపతి మొదటిసారి ప్రసంగిస్తారు. సెంట్రల్ హాల్‌లో వేడుక ముగిసిన తర్వాత… కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. ఫోర్‌కోర్ట్‌లో ఇంటర్-సర్వీసెస్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి వీడ్కోలు జరుగుతుంది.