NewsTelangana

పార్టీ మారుతున్నట్టు కావాలనే దుష్ప్రచారం-రాజగోపాల్ రెడ్డి

Share with

పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానన్నారు. కొందరు కావాలని మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నానన్నారు రాజగోపాల్ రెడ్డి. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యకర్తల మనోభావాలు పరిగణలోకి తీసుకున్నాకే ఏదైనా నిర్ణయం తీసుకుంటానన్నారు. టీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే రోజుల్లో కేసీఆర్ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తానన్నారు కోమటిరెడ్డి.