బయటపడుతున్న అన్నారం పంప్‌లు
భారీ వర్షాలు, వరదలతో నీటిలో మునిగిపోయిన అన్నారం పంప్ హౌస్ మోటర్లు, పంపులు ఇవాళ బయటపడ్డాయ్. ఐతే మోటార్లక భారీగా నష్టం వాటిల్లలేదని… బురదను శుభ్రం చేస్తు్నామని అధికారులు చెప్పారు. ప్రాజెక్టులోని పరికరాలు వర్షంతో దెబ్బతిన్నాయోమోనని పరిశీలిస్తున్నారు. 6 వేల హార్స్ పవర్ మోటార్లను ఉపయోగించి నీటిని తోడుతున్నారు. నీటిని పూర్తిగా తోడిన తర్వాత వాటిని బయటకు తీసి ఆరబెడతామని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక మేడిగడ్డలో నీరు తోడినా… పూర్తి స్థాయిలో శుభ్రపరచడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మేడిగడ్డలో భారీగా నష్టం వాటిల్లి ఉంటందని అంచనా వేస్తున్నారు. నీటిని పూర్తిగా తోడిన తర్వాతే విద్యుత్ పునరుద్ధరణ జరిగే ఛాన్స్ ఉంది. అన్నారం పంప్ హౌస్ తిరిగి గాడిలో పెట్టేందుకు అటు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు కలిసి పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్ నీళ్లలో మునిగిపోవడంతో.. వాటిని శుభ్రపరచడానికి విదేశీ సంస్థల యక్యూప్మెంట్ అవసరం కానున్నాయ్.