NationalNews

నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా

Share with

2022 రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమి తరుపున సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా ఓడిపోయే అవకాశమున్నా.. పెద్ద ఎత్తున విపక్షాలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా… ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముపై పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా కీలక నేతలంతా హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైన పదవి కోసం యశ్వంత్ సిన్హాను బలపరిచేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయన్నారు రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ఎన్నికలు పదవి కోసం కాదని… సిద్ధాంతాల కోసమని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, జమ్ము&కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్ఎల్డీ నేత జయంత్ సిన్హా, సీపీఎం నేత సీతారామ్ ఏచూరి, డీఎంకే నేత రాజా, సీపీఐ నేత రాజా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. 14 పార్టీల విపక్షాల కూటమి ఏకగ్రీవంగా యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నాయ్.