సోనియాకు కాల్ చేసిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీఏ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము… కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కాల్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగుతున్న తనకు మద్దతివ్వాల్సిందిగా ఆమె సోనియాను కోరారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమత బెనర్జీకి సైతం ద్రౌపది ముర్ము కాల్ చేశారు. ఏకాభిప్రాయం ద్వారా ద్రౌపది ముర్మును ఎన్నుకుందామని భావించినా… విపక్షాలు అభ్యర్థిని నిలిపాయంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఆదివాసీ మహిళగా తనకు ఇచ్చిన గౌరవాన్ని అన్ని పార్టీలు ఆమోదించాలన్న భావనను కలిగించారు ద్రౌపది ముర్ము.