మహకుంభమేళాలో డిప్యూటీ సీఎం దంపతులు
ప్రయాగ్ రాజ్ మహకుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా గంగానదికి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి పవన్ కళ్యాణ్ దంపతులు హారతి ఇచ్చారు. ఇది మనందరికీ గొప్ప అవకాశం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మనం భాష లేదా సంస్కృతి విషయంలో భిన్నంగా ఉండవచ్చు, కానీ ఒక మతంగా, మనమంతా ఒక్కటే. మహా కుంభమేళాను నిర్వహించినందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి రావాలనేది చాలా దశాబ్దాలుగా నాకున్న అతిపెద్ద కోరిక. ఈరోజు, నాకు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్.