రాహుల్ గాంధీకి కోర్టు నోటీసులు
వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణె కోర్టు నోటీసులు జారీచేసింది. అక్టో బర్ 23న రాహుల్ కోర్టు విచారణకు రావాలని ఆదేశించింది. కాగా హిందుత్వ సిద్ధాంతకర్తపై రాహుల్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని సత్యకి పుణె కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును గతనెలలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రే ట్ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. పిటిషన్ విచారణలో భాగంగా సావర్కర్ తరపున అడ్వకేట్ సంగ్రామ్ కోల్ త్కర్ వాదనలు వినిపించారు. దీంతో జాయింట్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అమోల్ షిండే అక్టోబర్ 23న రాహుల్ గాంధీ కోర్టు విచా రణకు కచ్చితంగా హాజరుకావల్సిందేనని నోటీసులు ఇచ్చారు.