32 మంది ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతోపాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. అయితే.. ఈ కార్యక్రమం ఆశించిన రీతిలో జరగట్లేదని సీఎం జగన్ భావించారు. నిఘా విభాగం ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించారు. తాజాగా అందిన సర్వే నివేదికను సీఎం జగన్ వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం 32 మంది ఎమ్మెల్యేలు వెనకబడినట్లు వెల్లడించి తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో మరోసారి గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

