Andhra PradeshNewsNews Alert

జగన్ ప్రభుత్వం..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపం

Share with

కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వానంగా తయారయ్యిందన్నారు నారా లోకేష్. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా..రాష్ట్రంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలను వరదలు ముంచెత్తాయి అన్నారు. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులలో కూడా జగన్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం ఆయన అసమర్ధత పాలనకు నిదర్శనమని తెలిపారు. ఈ నేపథ్యంలో బయటకు వస్తే ప్రజలు తనపై విరుచుకు పడతారని ముందే ఊహించిన ముఖ్యమంత్రి  ఆ భయంతోనే బయటకు రావటం లేదన్నారు.అంతేకాకుండా ఆయన అమలు చేసిన జగనన్న గుంతల రోడ్ల పథకం జగన్ నిద్రిస్తుంటే ఆయనకు చంద్రబాబు కలలోకి వచ్చేటట్లు చేస్తోందన్నారు. ఈ మధ్యకాలంలో  కరకట్ట కమల్ హాసన్ మొదలుపెట్టిన రాజన్న క్యాంటీన్ ఎన్నికల వరకేనని సూచించారు.వైసీపీ ఎమ్మేల్యేలు ప్రారంభంలో  రాష్ట్రంలోని ప్రతి గడపకు వచ్చి సమస్యలు తెలుసుకుంటామని హామి ఇచ్చారు.మరి ఇప్పుడేమో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తే..ప్రజలు తమ ఇబ్బందులను తెలుపుతున్నారని ఒక్క ఎమ్మెల్యే కూడా రావడం లేదన్నారు.ఇలా ప్రజలను నమ్మించి మోసం చేయడం ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎంకు మంచిది కాదన్నారు.

అయితే టీడీపీ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ కార్యక్రమాలను ఎప్పుడూ ఆపలేదని తెలిపారు.ఈ కార్యక్రమాలలో భాగంగా టీడీపీ పేద ప్రజల ఆకని తీర్చడం కోసం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆ విధంగా అన్న క్యాంటీన్లు మూతపడేలా చేసి..పేదల నోటి దగ్గర కూడూ తీసేసిన వ్యక్తి రామకృష్ణా రెడ్డి అని వెల్లడించారు.అయినా సరే టీడీపీ పేద ప్రజలకు అండగా ఉండి వారి ఆకలి తీర్చడం కోసం మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. దీనికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు నారా లోకేష్.ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అమాంతం పెరిగిన ధరల కారణంగా కుటుంబాలు గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. అవ్వా,తాత,చెల్లి అంటూ వరుసలు కలిపి అధికారంలోకి వచ్చిన జగన్ ధరలు విపరీతంగా పెంచి రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఇదే తరహాలో U1 జోన్ రైతులను  కూడా మోసం చేసిన సీఎం జగన్ మోసపు రెడ్డి అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జగన్ మార్కట్లో రైతులకు సరైన గిట్టుబాటు ధర కూడా లేకుండా చేశారని తెలిపారు. కాబట్టి మనం  మంగళగిరిలో మళ్ళీ గెలిచి విజయపతాకం ఎగుర వేయాలన్నారు. రాష్ట్రంలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి అందరూ జాగ్రత్తగా పనిచేయాలని అధికారులను,పోలీసులను ఆయన హెచ్చరించారు. అయితే మంగళగిరిలో మాత్రమే కాకుండా పులివెందులలో కూడా ఈసారి టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆయన ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని ప్రజలు మరో రెండు సంవత్సరాలలో కరకట్ట కమల్ హాసన్‌కు ప్యాకప్ చెప్పాలని నారా లోకేష్ స్పష్టం చేశారు.