వైసీపీ పార్టీ పై చంద్రబాబు ఫైర్..
చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వైసీపీ పాలనపై ప్రతి గడపలోనూ తీవ్ర వ్యతీరేకత వెలుగు చూస్తున్నాయన్నారు. తాజాగా చిత్తురు జిల్లా పూతలపట్టులో జరిగిన ఘటన పై స్పందిచిన చంద్రబాబు , ఎమ్మెల్యేను విద్యా దీవెన పై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్టు చెయ్యడం ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని విమర్శించారు. పాలనను ప్రశ్నించిన వారందరిని అరెస్టు చేస్తే , రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపై జగన్ కేసులు పెట్టాల్సి వస్తుందని విమర్శించారు.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై , పాలనపై ప్రజలు ఎంతో అసహనంగా ఉన్నరన్నారు. అభివృద్ది పనులపై , సంక్షేమ పథకాలపై జనం నుంచి వస్తున్న ప్రశ్నలకు ఏమి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కాలర్ ఎగరేసుకు తిరుగుతురన్నా చంద్రబాబు , ప్రజలే ఆ కాలర్ పట్టి ప్రశ్నించే రోజు త్వరలోనే వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వేసనపల్లి ఘటనలో వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పి… శ్రీకాంత్ అనే విద్యార్థిపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలన్నారు. అతనికి మద్దతుగా ఉన్న గ్రామస్తులను , టీడీపీ అధికారులపై తప్పుగా పెట్టిన కేసుని కూడా ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, విద్యార్దుల జీవితం గురించి ఆలోచించరా అని ఎద్దేవచేశారు.