Andhra PradeshHome Page Slider

సందడిగా పాపికొండల విహారయాత్ర

Share with

దేవీపట్నం, వరరామచంద్రాపురం: గోదావరిలో నీటిమట్టం తగ్గడంతో పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గండిపోశమ్మ ఆలయం నుంచి గురువారం రెండు బోట్లపై 82 మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించడానికి వెళ్లారని కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. తొలుత గండిపోశమ్మ అమ్మవారి దర్శనం అనంతరం వారంతా బోటుపై వెళ్లారు. రానున్న దసరా పండుగ నేపథ్యంలో ఈ విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బోటు నిర్వాహకులు చెబుతున్నారు. యాత్రలో పలు అందాలు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బోటు నిర్వాహకులు చెబుతున్నారు. యాత్రలో పలు అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల వరదలకు పేరంటపల్లి  శివాలయం వరద నీటిలో ముంపుకు గురైంది. ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో సందడిగా మారింది. బ్యాక్ వాటర్ ప్రభావం లేనంతవరకు పాపికొండల పరీవాహక ప్రాంతం కొల్లూరు ఇసుక తిన్నెల్లో పర్యాటకుల భోజనాలు, ఆటలతో సందడిగా ఉండేది. నేడు ఆ ప్రాంతమంతా తాటిచెట్టంత లోతు నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఈ యాత్రలో ఒక్క పేరంటపల్లి మినహా ఎక్కడా కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది.