“దసరా పండుగ ఆఫర్..ఐ ఫోన్ల కోసం ఎగబడ్డ జనం”
ఇటీవల కాలంలో మార్కెట్‌లోకి ఎన్ని కొత్త ఫోన్లు ఎన్ని రకాల ఫీచర్లతో వచ్చినా ఐ ఫోన్‌కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. కాగా ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌లో ముఖ్యంగా ఐ ఫోన్లు కొనేందుకు కస్టమర్లు ఎగబడ్డారు. దీంతో కేవలం 2 రోజుల్లోనే 4 లక్షల ఐఫోన్ల బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తాజాగా వెల్లడించాయి . దీని ద్వారా 2.4 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే వీటిల్లో ఎక్కువగా EMI ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.