చంద్రబాబును నమ్మడమంటే కాటేసే పామును నమ్మినట్టేనన్నసీఎం వైఎస్ జగన్
చంద్రబాబు పేరు చెప్తే మోసాలు, వంచనలే గుర్తొస్తాయన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుందన్నారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చ గుర్తుకొస్తుందన్నారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చేస్తాడన్నారు. ఇద్దరూ కలిసి 2014లో వాగ్దానాలిచ్చి మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు విడిపిస్తానని చీట్ చేశారన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు విడిపిస్తానని చీట్ చేశారన్నారు. 2014లో ఇచ్చిన హామీలను చెత్తబుట్టలో పడేశారని… చంద్రబాబును నమ్మడమంటే కాటేసే పామును నమ్మడమన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారన్నారు.

అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి జగన్ విడుదల చేశారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం ముందు రోజున అక్కచెల్లెమ్మెలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం వైఎస్ జగన్. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మెలకు అందిస్తున్నామన్నారు. 14 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తామన్నరు. 26,98,931 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 5 వేల 60 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఏటా క్రమం తప్పకుండా రూ. 18,750 అందిస్తున్నామన్నారు.


