Andhra PradeshNews

హైదరాబాద్‌లో చింతమనేని కోడిపందాలు

Share with

హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు జరుగుతున్నాయ్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు విఐపీలు… లక్షల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోడిపందాలు నిర్వహిస్తున్న… 20మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కొందరు పరారయ్యారు. పోలీసులను చూసి చింతమనేని పరారైనట్టు తెలుస్తోంది. చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పటాన్ చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయ్. పందాల కోసం ఉంచిన నగదును, కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకంజర్ల గ్రామంలో ఓ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు చింతమనేని నిర్వహిస్తున్నట్టు పోలీసులకు తెలిసింది. పదమూడు లక్షలకు పైగా నగదు, 32 కోళ్లు, 26 వాహనాలతోపాటు… 21 మంది బెట్టింగ్ రాయుళ్లు ప్రస్తుతం పోలీసులు ఆధీనంలో ఉన్నారు.