Andhra PradeshNews

జగన్ సర్కార్ న్యూస్ ఛానల్

Share with

టీవీ ఛానల్‌ను ప్రారంభిస్తున్న జగన్ ప్రభుత్వం

ఏపీ ఫైబర్ న్యూస్ పేరుతో ఛానల్‌ ప్రారంభం

ప్రతిపక్ష మీడియా ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్న జగన్

ప్రజల దృష్టికి సంక్షేమ పథకాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ టీవీ ఛానల్‌ను ప్రారంభించేందకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో ఈ ఛానల్‌ ప్రారంభించాలని ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ బోర్డు ఇటివల నిర్ణయించింది. ఏపీ ఫైబర్ న్యూస్ పేరుతో ఛానల్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో న్యూస్ ఛానల్ ఏర్పాటుకు అమోద ముద్ర వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను దీని ద్వారా నిర్వహిస్తారు. ఏపీ ఫైబర్‌కు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్‌ టూ హోమ్ కనెక్షన్ల ద్వారా ఈ న్యూస్ ఛానల్‌ను నిర్వహిస్తారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు యువత పనికి వచ్చే అన్ని రకాల ప్రసారాలు ఇందులో చేయాలని చూస్తున్నారు. ఏది నిజం..ఏది అవాస్థవం.. మరేది తప్పుడు, అసత్య ప్రచారం అనేది ప్రభుత్వ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల కళ్లముందు ఉంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకి వేస్తోంది. దానికోసం ఏపీఎస్ఎఫ్ఎల్ ను వేదికగా చేసుకుంది రాష్ట్రప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీఫైబర్ నెట్ ను భారీ ఎత్తున విస్తరిస్తున్నారు. కేబుల్ టీవీతోపాటు, ఇంటర్నెట్ సౌకర్యం అతి తక్కు మొత్తానికే రావడంతో రాష్ట్ర ప్రజలందరూ దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా ఎక్కువ మంది ప్రజలకు చేవరుగా ఉండే ఏపీఎస్ఎఫ్ఎల్ వేదిక ద్వారా ప్రభుత్వ న్యూస్ ఛానల్ వుంటే ప్రతిపక్ష మీడియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు సంక్షేమ పథకాలు, వాటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా వుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసి రంగంలోనికి దిగింది. ప్రభుత్వం సొంత ఛానల్ ను ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు, రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని జర్నలిస్టులకు ఉపాది దొరుకుతుంది.

యువతకు ఉపాది చూపడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతీ ఇంటికి చేరవేసేందుకు వీలుగా వుండేలా ప్రసారాలు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా టీవీ ఛానళ్లకు ఫీడ్ ఇచ్చేందుకు వివిధ ప్రైవేటు సంస్థలకు వందలాది కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వ అధికారిక టీవీ ఛానల్ లకే అప్పగించి ఆ మొత్తాన్ని ఇదే సంస్థకు వెచ్చించడం ద్వారాప్రత్యక్ష ప్రసారాలు చేసే యూనిట్లు, కెమెరాలు, ఇతర సాంతికే వ్యవస్థ కొనుగోలు చేసుకోవడానికి వీలుపడుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానికితోడు ఒక్కసారి పెట్టుబడి పెడితే వాటితో చాలా సంవత్సరాల పాటు సేవలు అందించ వచ్చునని.. తద్వారా ప్రభుత్వంపై ప్రతీ ఏటా ప్రచారాల ఖర్చు భారం తగ్గుతుందని కూడా ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వ టీవీ ఛానల్ ను సమాచారశాఖ కు అనుసంధానించడం ద్వారా ప్రతీ జిల్లాలోనూ జరిగే కార్యక్రమాలను, సదరు న్యూస్ వీడియోలను డీపీఆర్వో కార్యాలయాల నుంచే పంపించుకునే ఏర్పాటు చేయాలని కూడా సమాచాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలకు ఏలాంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా అందిస్తుందనేది ఛానల్ ఏమేరకు సక్సస్ అవుతుందో వేచిచూడాల్సీ ఉంది