InternationalNewsNews Alert

లంక బాటలోనే బంగ్లాదేశ్..! అక్కడా సంక్షోభం తప్పదా..?

Share with

నిన్న శ్రీలంక.. నేడు బంగ్లాదేశ్.. మన పక్క దేశాల్లో ఒక్కొక్కటి సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. వచ్చే మూడేళ్లలో 4.5 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను బంగ్లాదేశ్ తాజాగా కోరింది. అక్కడ కూడా చమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర 51 శాతం, డీజిల్ కిరోసిన్ ధర 42 శాతం పెరిగింది. దీంతో బంగ్లాదేశ్ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కష్టాల్లో ఉంది. రుణాలు తీసుకున్న వాళ్లు 11.11 బిలియన్ డాలర్ల మేర ఎగ్గొట్టినట్లు బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. నిజానికి దానికి రెట్టింపు సంఖ్యలో రుణాలు ఎగ్గొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్ ప్రధాన ఎగుమతి రంగం రెడీమేడ్ దుస్తుల డిమాండ్ కూడా లాక్ డౌన్ తర్వాత భారీగా పడిపోయింది. అప్పుల కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, జపాన్, ప్రపంచ బ్యాంక్ వద్ద చేతులు చాచింది. అయితే బంగ్లాదేశ్ పాలకులు మాత్రం దేశ ఆర్థిక పరిస్థితి అదుపులోనే ఉందని అంటున్నారు. తమ దేశ వ్యవసాయ రంగం ఇప్పటికీ బలంగానే ఉందంటున్నారు.