దుబాయ్ పారిపోవాలనుకున్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి
తీవ్ర ఆర్థిక,రాజకీయ సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రస్తుత పరిస్థితులకు కారణం రాజపక్స కుటుంబ పాలనే కారణమని అక్కడి ప్రజలు గొటబాయ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి “గొట గో హోం” అంటూ నినాదాలతో రాజపక్స అధికార నివాసం ముట్టడించి ఆందోళనలు చేపట్టారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసిన గొటబాయ రాజపక్స ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజాపక్స సోదరుడు, ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోదామనుకుని ప్రయత్నించి విఫలమయ్యారు. కొలంబొ విమానశ్రయంలో సిబ్బంది ఆయనను వెనక్కి పంపించారు. ఇమ్మిగ్రేషన్ ఆధికారులు కూడా ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈరోజు ఉదయం 12:15 గంటల ప్రాంతంలో వీఐపి టర్మినల్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆయన ప్రయణానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో దేశం విడటం వీలు కాదని తెలుసుకున్న బసిల్ రాజపక్స 3:15 గం వరకు వేచి చూసి విమానాశ్రయం నుంచి తిరిగివెళ్లిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక పరిస్థితులు చూసి ఉన్నతాధికారులు, నాయకులను దేశం వీడి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమతించట్లేదు.