International

శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ

Share with

శ్రీలంక మరోసారి రణరంగంగా మారిపోయింది,అధ్యక్షుడు గొటబాయ ,ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయాలంటూ అందోళనలు మిన్నంటాయి . లంకలో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ అధ్యక్షుడు గొటబాయ దేశం విడిచి పారిపోవడంపై…జనం ఆందోళనకు దిగారు..ప్రధాని రాజీనామా చేయ్యాలనే డిమాండ్ తో జాతీయా జేండాలు పట్టుకోని ప్రధానమంత్రి కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు వేలాదిమంది నిరసనకారులు ప్రయత్నించారు దేశంలో మరోసారి ఎమర్జేన్సీ విధించింది.కొలంబోలో పరిస్ధితి మరింత ఉద్రిక్తంగా ఉంది నిరసనకారులకు పోలీసులకు మధ్య అనేక చోట్ల ఘర్షణ తలత్తింది.పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అధ్యక్షుడు గొటాబయ దేశం వదిలి పారిపోవడంతో ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘే ఆపద్ధర్మ అధ్యక్షుడు అయ్యారు.రణిల్, గొటాబయ వెంటనే రాజీనామా చేయాలంటూ నిరసనలు చేస్తోన్న ప్రజలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Read More: మాల్దీవులకు శ్రీలంక అధ్యక్షుడు