శ్రీలంక అధ్యక్షుడు పరార్
శ్రీలంక రాజధాని కోలంబో మరోసారి రణరంగంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆందోళనకారులు శ్రీలంక రాజాధాని కోలంబో చేరుకోని, అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇంటిలోపలికి దూసుకెళ్లారు.ప్రస్తుతం దేశంలో ఉన్నఆర్థిక పరిస్ధితికి, ఆకలి తిప్పలకు కారణం రాజపక్సనేఅని అతను తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆందోళకారులపై శ్రీలంక ఆర్మీ టీయర్ గ్యాస్ ప్రయోగించింది. నిరసనకారులపై లాఠీచార్జి చేయడం వలన 26 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురు జవాన్లు గాయపడ్డారు. ఏకంగా ఒక దేశ ఆధ్యక్షుడి ఇంట్లోకి వెళ్లి ఆందోళన చేయడం చర్రితలో ఎన్నడూ లేదు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రాజపక్సేను ఆర్మీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.