ఏపీ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ గడపకు వెళ్లినా జగన్ నామస్వరం వినిపిస్తోందనన్నారు తమ్మినేని సీతారాం… ప్లీనరీకి విప్లవంలా వైసీపీ కార్యకర్తలు తరలివస్తున్నారని… ప్లీనరీలో పాల్గొంటే తప్పేంటన్నారు. గతంలో టీడీపీ మహానాడుకు నాటి స్పీకర్ శివప్రసాద్ పాల్గొనలేదా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్నానని… ఆ తర్వాతే ఎమ్మెల్యేనని.. ఆ తర్వాతే స్పీకర్‍నని చెప్పుకొచ్చారు. ప్లీనరీ పండగ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చోవాలా అంటూ చెప్పుకొచ్చారు తమ్మినేని సీతారామ్. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం తీసుకొచ్చారని… సంక్షేమ పథకాలు కనిపించడంలేదంటూ దుయ్యబట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం.