Andhra Pradesh

నా గడ్డంలో వెంట్రుక కూడా పీకలేరు

Share with

రెండవ రోజు ప్లీనరీ సభలో కొడాలి నాని

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించడానికి చంద్రబాబు నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారని అనునిత్యం ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని కానీ వారి వల్ల ఒరిగేది ఏమీ లేదని కనీసం నా గడ్డంలో వెంట్రుక కూడా వారు పీకలేరని వైయస్సార్సీపి రెండో రోజు ప్లీనరీ సభలో కొడాలి నాని అన్నారు. పేద పిల్లల చదువు కోసం సీఎం జగన్ 60 వేల కోట్లు ఖర్చు చేశారని ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే విమర్శలు చేస్తున్నారని ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 95% హామీలను అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు మతిస్థిమితం తప్పి రాష్ట్రంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ పదికాలాలపాటు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు అండ్ కో మతిస్థిమితం తప్పి పిచ్చాసుపత్రిలో చేరటం ఖాయమని అన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులలో చంద్రబాబు నాయుడు అంత పనికిమాలిన వ్యక్తి ఎవరూ లేరని రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించి సమాధి కట్టడం ఖాయమని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు జగన్ వైపే నిలబడి మళ్లీ అధికారంలోకి తీసుకురావటం ఖాయమని ఆయన ముగించారు.