ప్లీనరీలో రోజా పంచ్ డైలాగులు.. ఉబ్బితబ్బిబ్బయిన జగన్
వైసీపీ ప్లీనరీలో మంత్రి రోజా తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు. అంతేకాదు సీఎం వైఎస్ జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. వైసీపీ సాధారణ రాజకీయ పార్టీ కాదని దేశాన్ని గడగడలాడించిన సోనియాను గడగడలాడించిన పార్టీ అని… వెన్నుపోటు దారుడు చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ అని అన్నారు. వైఎస్ఆర్ లాంటి మహానేత మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఓ విజేతగా మనందరి ముందు జగన్ నిలబడ్డారని రోజా అన్నారు. అలాగే దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీని నిలబెట్టారన్నారు. ఈరోజు జగన్‌ను స్వర్గంలో ఉన్న వైఎస్సార్ దేవుడికి తన బిడ్డను చూపించి గర్వంగా చెప్పుకుంటారని రోజా అన్నారు.
వైసీపీ జెండా జగనన్న ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమని రోజా అన్నారు. కాన్ఫిడెన్స్ కు కటౌట్ వేస్తే జగన్ లా ఉంటుందని.. జగన్ కటౌట్ చూస్తే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయని… కంటెంట్ చూస్తే ప్రత్యర్థులకు ప్యాంట్లు తడిచిపోతాయంటూ తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. “ఆకలితో వేటాడే పులి చూసుంటారని ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారని ఆధిపత్యం కోసం వేటాడేపులిని చూసుంటారని కానీ ఆశయం కోసం వేటాడే పులే ఈ పులివెందుల బిడ్డ జగన్ అంటూ ఇంకెవరికీ సాధ్యం కానీ రితీలో జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.