కొండా సురేఖను క్షమించని అక్కినేని అఖిల్…
నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున నిరసన, తమ ఫ్యామిలీకి మంచి సపోర్టు దొరికినట్లైంది, ఈ విషయం మీకు తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ మాటలపై సినీ తారలు పెద్ద యెత్తున నిరసనలు తెలిపారు. తాజాగా అఖిల్ అక్కినేని సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడు స్థాయిలో ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా రక్షణ కల్పించాల్సిన ఆమె నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, దారుణమైన మాటలతో మా ఫ్యామిలీని షేమ్ చేసింది. ఆమె ప్రవర్తించిన విధానం, మాట్లాడిన మాటలు ఏమాత్రం క్షమించరానివిగా నాకు అనిపించాయి. ఆమె వ్యాఖ్యలతో సమాజంలో గౌరవ మర్యాదలు గల మా కుటుంబ ప్రతిష్ట దెబ్బతింది. స్వార్థ రాజకీయ యుద్ధంలో గెలిచేందుకు ఉన్నతమైన విలువలు, సామాజిక హోదా ఉన్న వ్యక్తులపై దాడి చేసి వారిని బలిపశువులు చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో అక్కినేని కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఊరుకునేది లేదు, ఎంతవరకు ఐనా వెడతాను. ఇలాంటి సిగ్గులేని వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి. మన సమాజంలో ఇలాంటి వ్యక్తులకు ఇకపైన స్థానం కల్పించరాదు. వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు అని అఖిల్ తన ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేశారు.