“తండేల్”ను వేధిస్తున్న పైరసీ..చివరికి బస్సులో కూడా..
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన గీతా ఆర్ట్స్ చిత్రం “తండేల్” మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలయ్యంది. విడుదల రోజే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ఈ చిత్రం ప్రదర్శించారనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రం ఇలా ఆన్లైన్లో, సోషల్ మీడియాలో షేర్ కావడంతో నిర్మాత బన్నీవాసు స్పందించారు. “సినిమాలు పైరసీ చేయడం చాలా అన్యాయం. ఇది చట్టవిరుద్దం, ఎంతోమంది ఆర్టిస్టులు, దర్శక నిర్మాతల కలగా ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది. గతంలో కూడా గీతా ఆర్ట్స్ ‘గీత గోవిందం’ చిత్రం పైరసీకి గురయ్యింది. సినిమా పైరసీ వస్తుంది. చూద్దామని అనుకుంటున్నారేమో ఇప్పటికీ ‘గీత గోవిందం’ పైరసీ చేసిన వారు జైల్లోనే ఉన్నారు. ఇలాంటి వారిని తేలికగా వదిలేస్తామనుకోవద్దు” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

