Telangana

కెరీర్‌లో తొలిసారిగా డిజిటల్ వైపు కృష్ణవంశీ

Share with

డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం ప్రకాశ్‌‌రాజ్ ప్రధానపాత్రలో ‘రంగమార్తాండ’ అనే సోషల్ డ్రామాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెలలో తెర మీదకు రానుంది. తదుపరి ఆయన దర్శకత్వంలో రానున్న మరో చిత్రమే ‘అన్నం’, రైతుల ఆకలి పోరాటాన్ని వివరించే నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇదిలా ఉండగా…. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఓ వెబ్‌సిరీస్‌ను చేయబోతున్నట్టు కృష్ణవంశీ వెల్లడించారు. ఈ వెబ్ సిరిస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి వంశీ తీవ్ర పరిశోధనచేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంచుకున్న కథ ఇంకా ఆసక్తిని కలిగిస్తోంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సుదీర్ఘ వెబ్ సిరిస్‌గా తీస్తున్నట్టు కృష్ణవంశీ స్వయంగా తెలిపారు. దీని కోసం తీవ్ర పరిశోధన జరుపుతున్నారని మీడియా వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ పోరాటంపై ఎన్నో చిత్రాలు తీశారు. కానీ వెబ్ సిరిస్‌ తీయడం ఇదే మెుదటి సారి. ప్రస్తుతం వంశీ ఆ ప్రయత్నం చేయడం సాహసమనే చెప్పాలి. తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన అంశాలున్నాయని… వాటన్నింటిని వివరించి తెలంగాణా చరిత్రను ఈ వెబ్ సిరిస్ ద్వారా విడమరచి చెప్పానన్నారు.

మెుత్తం 5 సీజన్స్‌గా ఈ వెబ్ సిరిస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఒక్కో సిజన్‌కు 10 ఎపిసోడ్స్ ఉంటాయి. 5 సీజన్స్‌గాను మెుత్తం 50 ఎపిసోడ్స్. ఓటీటీ చరిత్రలోనే ఈ సిరీస్ సంచలనం కానుందని సమాచారం. దానికోసం చరిత్రకారుల్ని కలుసుకొని… వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అన్నం చిత్రం తర్వాత ఈ వెబ్ సిరిస్ తెరపైకి రానుందని టాక్. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక ప్రముఖ ఓటీటీ కోసం ఈ వెబ్ సిరిస్‌‌ను నిర్మించనున్నారు. గులాబీ, చందమామ, ఖడ్గం, నిన్నేపెళ్లాడతా వంటి చిత్రాలు కృష్ణవంశీకి మంచి గుర్తింపునిచ్చాయి. ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నట్టు సమాచారం.