Home Page SliderTelangana

బ్యాంక్ అధికారుల బాధలు భరించలేక రైతు ఆత్మహత్య

Share with

బ్యాంకర్లు పెట్టిన బాధలు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బేల మండలంలోని రేణిగూడ గ్రామానికి చెందిన జాదవ్ దేవ్ రావ్ (60) శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఐసీఐసీఐసీఐ బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బేల మండలానికి చెందిన వివిధ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో, బ్యాంక్ అధికారులతో మాట్లాడి జరిగిన ఘటనపై వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ రైతు ఐసీఐసీఐసీఐ బ్యాంక్ లో తనకు ఉన్నటువంటి పొలాలను బ్యాంకులో మాడిగేట్ చేసి నాలుగు లక్షల అప్పు తీసుకున్నాడు. ఆరు నెలలకు ఒకసారి వాయిదా పద్ధతిలో రుణాలు చెల్లిస్తూ వచ్చాడు. ఈసారి పంటలు సరిగ్గా పండగ పోవడంతో వాయిదా పద్ధతిలో చెల్లించాల్సిన డబ్బులు రెండు నెలలు ఆలస్యమైంది. ఈ విషయమై బ్యాంక్ అధికారులు తరచుగా ఇంటికి వెళ్లి రైతును డబ్బులు కట్టాల్సిందని ఇబ్బందులకు గురి చేశారు. మనస్థాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి బ్యాంకులో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. వందల వేల కోట్ల బాకీలున్నటువంటి బడా బాబులకు నోటీసులు ఇస్తారు.. రైతు వద్ద మడిగేట్ చేసుకున్న పొలాన్ని అమ్మిన రూపాయలు 50 లక్షలు వస్తాయన్నారు. ఉన్నటువంటి నాలుగు లక్షల అప్పును రైతును అవమానపరిచే విధంగా చేయడం సరి కాదన్నారు. బ్యాంక్ అధికారులు హింసించడం వలన రైతు ఆత్మహత్య పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమై బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందని చనిపోయిన రైతు కుటుంబానికి ఎలా న్యాయం చేస్తారో తెలియజేయాలని సూచించమన్నారు.