Breaking NewsPoliticsTelangana

మాట‌ల తూటాలు పేల్చిన కేసిఆర్‌

ప్ర‌జ‌లు,పార్టీ నాయ‌కులు ,తెలంగాణ వాదులంతా ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు సిద్ధంగా ఉండాల‌ని మాజీ సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి స‌హా అధికార పార్టీ కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలంతా కేసిఆర్ ఫాం హౌస్ నుంచి రావాలంటూ డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న అనూహ్యంగా పార్టీ మీటింగ్‌కి అటెండ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కేసిఆర్ మాట‌ల తూటాల‌ను పేల్చారు.కాంగ్రెస్ పార్టీకి వ‌ద్ద‌ని చెప్పినా విన‌కుండా ప్ర‌జ‌లంతా ఓట్లేశార‌ని,దానికి ఫ‌లితం అనుభ‌విస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి…రైతుబంధుకి రాం రాం చెప్పార‌ని, ద‌ళిత‌బంధుకు జైం భీం చెప్పాడ‌ని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ఏడాది పాల‌న‌లో ప్ర‌జ‌లు దుఃఖాన్ని అనుభ‌విస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తులం బంగారానికి ఆశ‌ప‌డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు క‌నిపిస్తే ప్ర‌జ‌లు కొట్టేట్టున్నార‌ని అన్నారు. సోష‌ల్‌ మీడియాలో కాంగ్రెస్ వాళ్లు పోల్ పెడితే బీ.ఆర్‌.ఎస్‌.గెల‌వ‌డంతో కాంగ్రెస్ వాళ్లు స‌గం చచ్చిపోయుంటార‌ని చెప్పారు.రాబోయే రోజుల్లో త‌మ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌బోతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.