కూలీలను తీసుకెళ్తూ…
అదుపు తప్పి ఆటో ట్రాలీ చెట్టుని ఢీకొట్టిన ఘటన బుధవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది.కందుగుల గ్రామం నుంచి భీంపల్లి గ్రామానికి వరి నాట్లు వేయడానికి కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ స్టేజి ఎదుట డివైడర్ ని ఢీకొట్టింది.దీంతో ఆటో ట్రాలీలో ప్రయాణిస్తున్న వారిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తలలకు తీవ్రమైన దెబ్బలు తగలడంతో రక్తస్వావమైంది.అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసుకున్నారు.

