సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్ డే విషెస్
ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. పలువురు రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా సీఎం కు ట్వీట్ చేస్తూ.. ‘నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను.. మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చు.. మీ బర్త్ డే సందర్భంగా కావాలంటే కేక్ కట్ చేయిస్తా.. ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
