ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకేసారి మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రికార్డ్ స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని మంత్రి చెప్పారు. ఫస్టియర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని… ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత కాగా… సెకండ్ ఇయర్‌లో 61 శాతం మంది పాసయ్యారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలురు 49 శాతం, బాలికలు 50 శాతం ఉత్తీర్ణతపొందారని… సెకండ్ ఇయర్‌లో బాలురు 56 శాతం, బాలికలు 60 శాతం పాసయ్యారన్నారు బొత్స. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీకౌంటింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఆగస్టు 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ