crimeHome Page SliderPoliticsTelangana

రేసు కేసులో ఈడికి ఎందుకంత అత్యుత్సాహం?

ఫార్ములా -ఈ రేసు కేసులో తెలంగాణ ఏసిబి కేసు న‌మోదు చేస్తే దాన్ని శాంతియుతంగా ఎదుర్కొంటాన‌ని ప్ర‌క‌టించిన మాజీ మంత్రి కేటిఆర్ … ఈడి(ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌)పై మాత్రం నిప్పులు చెరిగారు.తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో రైడ్స్ నిర్వ‌హించిన ఈడి ఏం తేల్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో మితృలుగా జీవిస్తూ ఢిల్లీలో మాత్రం శతృవులుగా నాటిస్తున్నార‌ని కేటిఆర్ ధ్వ‌జ‌మెత్తారు.తెలంగాణలో ఆదానీ పల్లకీ మోసే రేవంత్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు తెరవడం లేద‌ని కేటిఆర్ ప్ర‌శ్నించారు.జాతీయ స్థాయిలో ఆదానీ మీద పోరాడుతున్న రాహుల్ గాంధీ.. ఏడాదిలో తెలంగాణలోని రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించడం లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ కార్ రేస్ మీద శాసనసభలో కాంగ్రెస్ ఎందుకు చర్చకు అవకాశం ఇవ్వ‌ల‌దేని ప్ర‌శ్నిస్తే కేసులు న‌మోదు చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు.