News

వైసీపీ ఎంపీ వెకిలి చేష్టలు… కాంగ్రెస్ ఎంపీ దారుణ వ్యాఖ్యలు దేనికి సంకేతాలు?

Share with

రాజకీయలు రోజు రోజుకు దిగజరిపోతున్న వైనానికి ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయాలే మచ్చు తునకులు. రాష్ట్రం మొత్తం మీద ఒక పార్లమెంట్ సభ్యుడు గురించి వీడియో వైరల్ అవుతోంది. ఈ టెక్నాలజీ కాలంలో ఏవి నిజమైన వీడియోలో ఏవి మార్ఫింగ్ వీడియోలో అర్థం కావడం లేదు. నిజమైన వీడియో ఉంటే మార్ఫింగ్ వీడియో అంటారు. మార్ఫింగ్ వీడియో అంటే నిజమైన వీడియో అంటారు. ఆ వీడియో చూస్తే అది మార్ఫింగ్ వీడియో అని మాత్రం అనిపించడం లేదు. ఆ విషయం ఎలా మన మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రం నీచాతి నీచముగా ఉంది. ఆ వీడియోలు పదే పదే ప్రచారం చేయడం.. దాని మీద కొంతమంది మేధావులతో చర్చ కార్యక్రమాలు…ఆ బూతు కన్నా వీళ్ళ బూతులు.. ఇంకా భయంకరంగా ఉన్నాయి.

జరగాల్సిన చర్చ ఏమిటి ? జరుగుతున్న చర్చ ఏమిటి ?
ఈ ఒక్క సంఘటనే కాదు ..దేశంలో అనేక చోట్ల ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఒక అసెంబ్లీలో ఒక శాసన సభ్యుడు బూతు వీడియోలు చూడటం… మరో చోట అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు బయటకు రావడం.. అవి కొన్ని రోజులు హాట్ టాపిక్‌గా మారి… మీడియా trp పెంచుకోవడం… తరువాత అందరూ మర్చిపోవడం జరుగుతోంది. బాధ్యతాయుతమైన మీడియా… ఇంకా సోషల్ మీడియాలో జరగాల్సిన చర్చ ఇది కాదు.. ఇలాంటి వారిని ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారు. వీళ్లు ఎలా ప్రజా ప్రతినిధులు అవుతున్నారనే విషయం… ఒక అసెంబ్లీలో కూర్చున్న వ్యక్తి అసభ్య వీడియోలు చూస్తూ ఉంటే దాన్ని అనుమతించిన శాసనసభ విషయాల మీద… అలాంటి వారిపై ముందు తరానికి గుర్తు ఉండే విధంగా మన వ్యవస్థలో మార్పు రావాలి. ఆ కోణంలో చర్చ జరిగి ప్రజల్లో చైతన్యం చేయాలి. కానీ జరుగుతున్న రచ్చ ఏమిటో అర్థం కావడం లేదు. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో అది కూడా ఆంధ్రభవన్ లో ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయి? పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేశంలో ఒక దేవాలయం లాంటిది .. దేవాలయం లో మనం వెళ్లేటప్పుడు ఎంత పవిత్రంగా వెళ్తాం.. మరి ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతినిధులుగా ఉండే వ్యక్తులు ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి? అసలు జరుగుతున్న లోపం ఎక్కడిది ?

పార్లమెంటు చట్టాలను మార్చే సమయం అసన్నమైంది

ఈ మధ్య కాలంలో సుదీర్ఘ చరిత్ర గలిగిన.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ పక్ష నేత రంజన్ చౌదరి సాక్షాత్తూ రాష్ట్రపతిని ఉద్దేశించి అభ్యoతకర వ్యాఖ్యలు చేసిన ఆయన మీద ఎటువంటి చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి మన రాజ్యాంగము ఒప్పుకోదు. అదే ఒక సామాన్యుడు అటువంటి వ్యాఖ్యానాలు చేసి ఉంటే అతని మీద ఒక డజనుకు పైన సెక్షన్లు మోపి కటకటాల్లోకి నెట్టేవారు. ముందు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్ని జైలుకు పంపించేవారు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు మీద అటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పార్లమెంటులో పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందర అందరూ సామానులే అని చెబుతుంది. మరి అదే రాజ్యాంగములో ప్రకరణ 105, ప్రకరణ 194 ప్రకారం పార్లమెంట్‌లో శాసన సభలో సభ్యులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించకూడదు. ఈ ప్రకారమే వీళ్లకు ఒక గొప్ప అవకాశంగా మారింది. మన రాజ్యాంగ నిర్మాతలు ఆనాటి కాలానుగుణంగా నాటి రాజకీయ నాయకుల పరిస్థితిని బట్టి ఈ నిబంధనలు పెట్టి ఉంటారు. కానీ నేటి నాయకుల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

మనకు స్వాతంత్ర వచ్చిన తరువాత ఇందిరా గాంధీ లాంటి నిరంకుశ పాలకుల చేతికి అధికారం పోతే జరిగే పరిణామాలు ఊహించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆ అధికారణం పెట్టి ఉండవచ్చు.. కానీ నేటి రాజకీయ నాయకులకు సేవ అనే పదం ఒక బూతు పదంగా మారింది. ఏ ప్రజలు అయితే ఎన్నుకున్నారో వారి మీదే అధికారం చెలాయిస్తున్నారు. న్యాయం ముందర అందరూ సామానులే అంటూనే రాష్ట్రపతి… రాష్ట్ర గవర్నర్ తప్పు చేసిన క్రిమినల్ కేసులు పెట్టడానికి వీలు లేదు. మన రాష్ట్రంలోనే ఒక గవర్నర్ గారి రాసలీలలు చూసాం. ఇప్పుడు చర్చ జరగవలసింది.. ఇలాంటి సమయంలో ఒక పార్లమెంట్ సభ్యుడిని ఎలా తొలగించాలి.. లేదా ఎలాoటి శిక్ష వేస్తే భావితారలు ఇటువంటి పనుల జోలికి పోవు అనే మీద చర్చ జరగాలి….

రాజ్యాంగములో ఒక పార్లమెంట్ సభ్యుడు మీద అనర్హత వేటు వేయాలంటే అదో ఒక పెద్ద కార్యాచరణ.. పార్లమెంట్ సభ్యుడిని సభ నుంచి తొలగించే అధికారం ఒక రాష్ట్రపతికే ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడిని తొలగించడానికి సుమారు 9 నిబంధనలు ఉన్నాయి. వాటిలో ఏది ఒకటి రుజువు ఆయన అతడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. అందులో ఒక నిబంధన ఉంది అది సభ్యుడు ” మానసిక ప్రవర్తన” కానీ ఆ ప్రవర్తన కూడా కోర్టు ధృవీకరించాలి. ఇది ఈ వ్యవస్థలో కుదిరే విషయం కాదు. ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు గాని శాసన సభ్యుడుగానీ అనైతికంగా ప్రవర్తించిన..అతని సభ్యత్వం వెంటనే కోల్పోడానికి పార్లమెంట్‌లో ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండాలి. అది స్పీకర్ అధీనంలో ఉండాలా లేఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధీనంలో ఉండాలా ..లేకపోతే ఎన్నికల కమిషన్ చేతిలో ఉండాలా అనేది చర్చ జరగాలి. ఒక ప్రవర్తన ఉన్న సభ్యుడు అనర్హత పొందితే అతనికి మాజీ పార్లమెంటు సభ్యుడి హోదాను కూడా తొలగించాలి. అవసరైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టి శిక్ష పడేటట్లు చేయాలి. మన దేశ పునాదులు ప్రపంచంలోనే అత్యున్నత మైన నైతిక విలువలు… పవిత్రమైన భావనలతో నిర్మితమయ్యాయి. అటువంటి వాటికి భంగం కలుగుతూ ఉంటే రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి మన వ్యవస్థను మనమే కాపాడుకోవాలి.

Dr G అజ్మతుల్లా ఖాన్
మదనపల్లె