NewsNews AlertTelangana

ఈ నెల 21న డేట్‌ ఫిక్స్‌…

Share with

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 21న కేంద్రమంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ సీనియర్‌ నేత వివేక్‌ వెంకట స్వామితో కలిసి అమిత్‌షాను రాజగోపాల్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతోపాటు చాలా మంది బీజేపీలో చేరుతారని అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నిక వస్తేనే నిధులు వస్తాయని, కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చేలా ఉప ఎన్నిక తీర్పు ఉంటుందన్నారు. అభివృద్ది అంతటా సిద్ధిపేట, సిరిసిల్లలకే పరిమితం చేశారని, ఉప ఎన్నిక తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తెస్తుందన్నారు. ప్రజలు ధర్మం వైపు ఉంటారని నాకు గట్టిగా నమ్మకం ఉందన్నారు.

మరో వైపు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇవాళ జరిగిన మీటింగ్‌కు హాజరుకాలేదన్నారు. చెరుకు సుధాకర్‌ చేరిక పట్ల వెంకట్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్‌ పేరు ప్రతిష్టలను చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

మరోవైపు.. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై కూడా ఫైర్‌ అయ్యారు రాజగోపాల్‌ రెడ్డి. రేవంత్‌ రెడ్డి సీఎం చేయడానికి మేము కష్టపడాలా అని ప్రశ్నించారు. బయట నుంచి వచ్చిన వ్యక్తుల చేతుల్లో కాంగ్రెస్‌ పార్టీ పెట్టారన్నారు. మాపై నిందలు వేయడం, తిట్టడం రేవంత్‌ రెడ్డి పెద్ద తప్పు చేశాడని ఘాటుగా విమర్శించారు రాజగోపాల్‌ రెడ్డి.. మొత్తానికి ఈ నెల 21న బీజేపీ గూటికి చేరడానికి రాజగోపాల్‌ రెడ్డి రెడీ అయ్యారు.