NationalNews

కాంగ్రెస్ ఎంపీ గలీజ్ వ్యాఖ్యలు… దద్దరిల్లిన పార్లమెంట్

Share with

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవంటూ బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ ఎంపీ ముర్మును రాష్ట్రపత్ని అంటూ ఉద్దేశపూర్వక దురుద్దేశాన్ని చాటారని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్‌పై… సోనియా గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును.. రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు… సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిలో మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని ఆమె మండిపడ్డారు. సోనియా గాంధీ ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకని, స్త్రీ వ్యతిరేకిని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా తన నాయకురాలు అలా మాట్లాడటానికి అనుమతించినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. సోనియా గాంధీ దేశం ముందుకు వచ్చి రాష్ట్రపతిని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని లోక్‌సభలో ఆర్థిక మంత్రి డిమాండ్ చేశారు.

ఐతే మొత్తం వ్యవహారంపై అధీర్ రంజన్ చౌదరి కౌంటర్ ఇచ్చారు. కేవలం నాలుక జారానని… బీజేపీ ఒక కొండ నుండి ఒక పర్వతాన్ని తయారు చేస్తోందని దుయ్యబట్టారు. ధరల పెరుగుదల, జీఎస్‌టీ, అగ్నిపథ్‌ పథకం, నిరుద్యోగం తదితర అంశాలపై కీలక చర్చల నుంచి బీజేపీ దృష్టి మరల్చుతోందని మండిపడ్డారు. బీజేపీకి క్షమాపణ చెప్పే అవకాశం లేదని నొక్కిచెప్పారాయన. స్వయంగా శ్రీమతి ముర్ముని కలుస్తానని… రాష్ట్రపతికి వందసార్లు క్షమాపణలు చెబుతానన్నారు. మాతృ భాష బెంగాలీ అన్న అధిర్ రంజిన్ చౌదరి… హిందీలో ప్రావీణ్యం లేకపోవడం వల్లే పదం అలా ధ్వనించిందన్నారు. భారత రాష్ట్రపతి, బ్రాహ్మణుడు అయినా, ఆదివాసీ అయినా రాష్ట్రపతి మనకు రాష్ట్రపతి.. ఆ పదవికి మా గౌరవం ఇస్తామన్నారు. విజయ్ చౌక్‌లో నిరసన తెలుపుతున్నప్పుడు విలేకరులు మమ్మల్ని ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారని అడిగితే… రాష్ట్రపతి భవనాన్ని సందర్శించాలనుకుంటున్నానన్నారు. రాష్ట్రపత్ని అంటూ సంబోధించానని.. పొరపాటున అలా మాట్లాడి ఉండొచ్చని… ఆ బైట్ ప్రసారం చేయకపోవడం మంచిదన్నారు. నేను ఒక్కసారి పొరపాటన మాట్లాడితే… బీజేపీ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే మొత్తం వ్యవహారంపై అధిర్ రంజిన్ చౌదరి క్షమాపణలు చెప్పారు.