Andhra PradeshNews

స్టార్ హీరో సినిమాలో ‘వంటలక్క’కు ఛాన్స్

అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బీజీగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా నాగచైతన్య , కృతిశెట్టి జంటగా నటిస్తున్న NC22 సినిమా నుండి అదిరిపోయే అప్‌డెట్ వచ్చింది. ఈ సినిమాలో కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క ఫేమ్ ప్రేమి విశ్వనాథ్‌కు అవకాశం ఇచ్చినట్టు చిత్ర యానిట్ ప్రకటించింది. ఈ సినిమాలో ప్రియమణితో పాటు ఓ కీలక పాత్రలో ఈమె కూడా కనిపించనున్నట్టు సమాచారం. కాగా కార్తీకదీపం సీరియల్‌లోని వంటలక్క… దీప పేరుతో ప్రేక్షకుల ఆదరణ పొందింది ప్రేమి. ప్రస్తుతం ఈ సీరియల్‌కు ఉన్న ఫేమ్ వేరే ఏ సీరియల్‌కు లేదనే చెప్పొచ్చు. ఈ వార్తను NC22 అని ఉన్న ఫైల్‌ పై వెల్‌కమ్ అన్ బోర్డ్ అంటూ ఈమె ఫోటోను చిత్రబృందం షేర్ చేసింది.