NationalNews

మొదలు షాక్‌… తర్వాత బ్లాక్‌ బస్టర్‌ టాక్‌..

Share with

ఆయన ఒక విలక్షణ నటుడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్న బాలీవుడ్‌ హీరో. ఆయనే మిస్టర్‌ పరఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌. తాజాగా `లాల్‌ సింగ్‌ చడ్డా’ అనే మూవీలో నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన మూవీ ఈ రోజే రీలీజ్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా షోలు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సినిమాపై ఓ లుక్కేద్దాం…

అద్వైత్‌ చందన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ  సినిమాను ఆమీర్‌ ఖాన్‌ సొంత బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హీరోయిన్‌గా కరీనా కపూర్‌, టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటించారు. తంజు టికు, ప్రీతమ్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. మొదటి రోజే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ట్విట్టర్‌ వేదికగా ఎక్కువ మంది ఈ మూవీ బాగుందని చెబుతున్నారు.

మూవీ ఎలా ఉందంటే…

అమాయక యువకుడు ఇండియన్‌ ఆర్మీలో చేరడం.. అక్కడ ఎదురైన సంఘటనలతో పరివర్తన చెందడం.. అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఓవరాల్‌గా చూస్తే.. ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు డైరెక్టర్‌ అద్వైత్‌ చందన్‌. అయితే, ఇంటర్వెల్‌ మాత్రం సూపర్‌గా ఉంది.. ఇక సెకండాఫ్‌ మాత్రం ఎంతో ఎమోషనల్‌గా సాగి, ఊహించని రీతిలో క్లైమాక్స్‌ ముగుస్తుంది. వన్ మ్యాన్‌ షోగా సాగిన ఈ సినిమాను ఆమీర్‌ ఖాన్‌ తన భుజాన వేసుకున్నారు.  అలాగే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, కామెడీ, ఇంటర్వెల్‌, ఎమోషన్స్‌, క్లైమాక్స్‌ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్లుగా ఉన్నాయి. అయితే.. లాజిగ్‌ లేని సీన్స్‌, పాటలు, ఫస్టాఫ్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. మొత్తంగా ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్‌కు నచ్చుతుంది.

నటీ నటులు ఎలా చేశారంటే..

ఈ సినిమాతోనే టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇందులో చైతూ పాత్ర పేరు బాలరాజు. గుంటూరు దగ్గర ఓ చిన్న ఊరి నుంచి ఆర్మీలో చేరేందుకు వెళ్తాడు. సైన్యంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. ఆమీర్‌ ఖాన్‌తో కలిసి చైతూ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు సాగుతుంది. తెలుగు దర్శకులు చూపించని విధంగా డైరెక్టర్‌ అద్వైత్‌ ప్రజెంట్‌ చేశాడు. ఈ మూవీలో ఆమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ కెమిస్ట్రీ వర్కౌట్‌ అయింది.

మరో వైపు.. తొలిరోజే ఆమీర్‌ఖాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. `లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమాను బ్యాన్‌ చేయాలని చాలా రోజులుగా ఓ డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే.. మూవీ విడుదల రోజే #BycottLalSinghChaddha అనే ట్యాగ్‌ను చాలా మంది ట్విట్టర్‌లో నెగెటివ్‌ టాక్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.  కానీ ఈ చిత్రంపై  ఈ ట్యాగ్‌ ఎలాంటి ప్రభావం చూపించలేదు. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ రావడంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.