Home Page SliderInternationalPolitics

అమెరికా డీల్‌కు ‘నో’ చెప్పిన ఉక్రెయిన్

రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగించడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. అయితే ట్రంప్ తన వ్యాపారి బుద్దిని ఉక్రెయిన్‌పై చూపించారు. సౌదీ అరేబియాలో జరిగే శాంతి చర్చలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడతానని పేర్కొన్నారు. కానీ దానికి బదులుగా ఉక్రెయిన్‌ ముందు ఒక డీల్ ప్రతిపాదించారు. అదేంటంటే ఉక్రెయిన్‌లోని అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికితీసేందుకు 500 బిలియన్ల డాలర్ల మేర ఒప్పందానికి ఒప్పుకోవాలని షరతు విధించారు. కానీ దీనివల్ల ఉక్రెయిన్ ఖనిజ వనరుల వల్ల అమెరికాకు 50 శాతం లాభం చేకూరనుంది. అక్కడి అరుదైన ఖనిజాలు, చమురు, గ్యాస్, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే ఈ ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ డీల్‌ను అంగీకరించలేదని సమాచారం. ఇలాంటి ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలు నిర్ణయించడంలో అమెరికాకే ఎక్కువ నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది.