Andhra PradeshHome Page Slider

బిచ్చగాడు చిల్లరతో ఐ ఫోన్ కొంటే..!

Share with

బిచ్చగాడు ఐ ఫోన్ కొంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఐ ఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ, దాని ఖరీదు చూసి కొనడానికి సామాన్యులు వెనకడుగు వేస్తుంటారు. అదే ఓ బిచ్చగాడు ఐ ఫోన్ కొనడానికి వెళ్తే షాప్ యాజమాన్యం అతణ్ణి లోనికి రానిస్తారా, ఎలా అతణ్ణి ఎగాదిగా చూస్తారు. మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అసలు అంగీకరించరు. ఇలాంటి ప్రశ్నలతో ఓ ప్రయోగం చేశారు ఎక్స్‌పెరిమెంట్ కింగ్ అనే యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. వారిలో ఒకరు బిచ్చగాడి వేషం వేసుకొని తొలుత జోధ్‌పూర్‌లో కొన్ని మొబైల్ షోరూంలు తిరిగాడు. కొందరు లోపలికి రానివ్వకపోగా.. మరికొందరు చిల్లర తీసుకోడానికి నిరాకరించారు. చివరగా ఓ షాపు యజమాని చిల్లర తీసుకొని తనకు ఐ ఫోన్ ప్రో మ్యాక్స్‌ మోడల్‌ను అందజేశాడు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదే ప్రాంక్ అని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయాడు.