NationalNews

మహా నెంబర్స్

Share with

మహారాష్ట్ర సంకీర్ణ సర్కారు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో అసలు అసెంబ్లీలో బలాబలాలు గురించి తెలుసుకోవాలి. మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం సభ్యులు 288. ఇద్దరు సభ్యులు జైల్లో ఉండగా… ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం అసెంబ్లీ బలం 285. అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 143. ప్రస్తుతం బీజేపీ బలం 106. శివసేన 56, ఎన్సీపీ 52, కాంగ్రెస్ సభ్యులు 44, ఎస్పీ 2, ఇతరులు 27 మంది ఉన్నారు. ఐతే గుజరాత్ సూరత్ హోటల్లో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహా వికాస్ అగాడి ప్రభుత్వానికి 152 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలుండగా, 21 మంది ఎమ్మెల్యేలు సూరత్ హోటల్లో ఉన్నారు. వారిలో స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇప్పుడు ఎక్ నాథ్ షిండేతోపాటు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే శివసేన ఎమ్మెల్యేలు 34కి తగ్గుతారు. అప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వ బలం 131 సీట్లకు తగ్గుతుంది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పిస్తే… అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 133కి తగ్గుతుంది. అసెంబ్లీలో తనమకు 135 మంది సభ్యుల మద్దతుందని బీజేపీ చెబుతోంది. 21 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలంటే… వారిపై అనర్హత వేటు పడనుంది. ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది.