NationalNews

అపర చాణిక్యుడు దేవేంద్ర ఫడ్నవీస్

Share with

దేశ రాజకీయాల్లో కనివిని ఎరగని రీతిలో రాజకీయ విలువలు కాపాడి అపార చాణిక్యుడయ్యారు దేవేంద్ర ఫడ్నవిస్. వెన్నుపోటు రాజకీయలు చూసాం. అవకాశం ఉంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను కబళించిన చరిత్ర చూశాం…పార్టీ ఫిరాయింపుల చట్టం అనే కత్తి నుంచి కాపాడుకోవడానికి ఎన్నికైన ప్రతినిధులు పార్టీని గంప గుత్త గా అధికార పార్టీ లో కలిపేసిన చరిత్ర చూశాం… కానీ ఫడ్నవిస్ నీతి బాహ్యమైన పనులు చేయకుండా రాజకీయ విలువలు కాపాడి అటు ప్రాంతీయ పార్టీ ఆయన శివసేన ను కాపాడారు. అలాగే అధికారం కోసం బీజేపీ అర్రులు చాచడం లేదని స్పష్టమైన సందేశం ఇచ్చారు.. నేటి రాజకీయాలు చూస్తున్నాం… ధనము కులం మతం చుట్టూ తిరుగుతున్నాయి …అవరమైతే సొంత రక్తసంబంధికులను సైతం వెన్నుపోటు పొడిచి అధికారం కైవసం చేసుకుంటున్న వైనం చూస్తున్నాం ..కానీ శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలను తమ అధికార దాహం తీర్చుకోవడానికి బీజేపీ ఉపయోగించుకోలేదు ..

మహారాష్ట్రలో ఈ మధ్యలో జరిగిన పరిణామాలు చూస్తే 2019 ఎన్నికల కు ముందు బీజేపీ +శివసేన కలిసి ప్రజాతీర్పు ను కోరాయి ..ప్రజలు బీజేపీ కి 102,శివసేన కు 53 సీట్ల తో మెజారిటీ స్థానాలు ఇచ్చి పాలించమన్నాయి… కానీ థాక్రే అత్యాశ వల్ల ..శివసేన సిద్ధాంతాలకు, హిందుత్వ అజెండా కు పూర్తి వ్యతిరేకంగా ఉండే ncp ,కాంగ్రెస్ తో కలిసి శివసేన ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొంది. అధికారం మొత్తం ఆ రెండు పార్టీ లదే ..కనీసం శివసేన mla లకు సొంత ప్రభుత్వం లో విలువ లేకుండా చేసి వారి అస్తిత్వనికే ప్రమాదం వచ్చేటట్లు చేశారు. మొత్తం మంత్రి వర్గంలో సగం మంది వివిధ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏకంగా ఇద్దరు మంత్రులు అవినీతి ఆరోపణల మీద జైలు శిక్ష అనుభవిస్తున్నారు..

ఇలాంటి సంకట పరిస్థితి లో నిజమైన పార్టీ కార్యకర్తలు ముందు శివసేనను కాపాడుకోవాలి అని దృఢ సంకల్పంతో బయటకు వచ్చారు… బయటకు వచ్చిన శివసేన ఎమ్మెల్యేలతో బీజేపీ రాజకీయ క్రీడా అడకుండా ప్రజాస్వామ్యన్నీ రక్షించిందనాలి…. సాధారణంగా రాజ్యంగము లోని 10 వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు 3 వ వంతు బయటకు వస్తే వారినే ఆ పార్టీ ప్రతినిధులుగా స్పీకర్ గుర్తిస్తారు… ఆ ప్రతినిధుల మీద అనర్హత వేటు పడదు.. లేదా ఆ పార్టీ లోని సభ్యులు వేరే పార్టీ లో విలీనం కావచ్చు …అప్పుడుకూడా వారిపై అనర్హత వేటు పడదు ..ఎటువచ్చి కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వచ్చిన నష్టం అంటూ ఏది లేదు….

ఇక బీజేపీ విషయం చూస్తే అసెంబ్లీ లో అతిపెద్ద పార్టీ …శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని సీఎం పదవిని అధిరోహించే అవకాశం ఉంది… అలాకాకుండా …ఎన్నికల కు వెళ్లే అవకాశం ఉండేది…. కానీ రెండు మార్గాలను కూడా ఎన్నుకోకుండా. …మధ్యే మార్గాన్ని ఎన్నుకొని …బీజేపీ అధికారం కోసం అర్రులు చాచడం లేదని స్పష్టమైన సందేశాన్ని ఇస్తూ.. మరోవైపు శివసేన కార్యకర్తల దీర్ఘకాలిక కోరిక ఆయన శివసేన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలి అనే ఆశను నెరవేర్చిన ఘనత చిక్కింది…

ఉద్ధవ్ థాక్రే, శివసేన పార్టీ పూర్తిగా తిరుగుబాటు నాయకుల ఆధీనంలోకి రావడం ఖాయం…పార్టీ ..ప్రభుత్వం వీరి చేతిలో ఉండటం వల్ల పార్టీ క్యాడర్ మొత్తం… ఎక్ నాథ్ షిండే వారి నాయకత్వంలోకి రావడం ఖాయం…శివసేన అస్తిత్వం అలాగే ఉంటుంది.. కానీ ఉద్ధవ్ థాక్రే శకం శివసేనలో ముగుస్తుంది. మిగిలిన పరిపాలన కాలంలో జనరంజకంగా పాలన అందిస్తే ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తిరుగు ఉండదు. రాజకీయ విలువలకు కట్టుబడిన బీజేపీ ఒక ప్రక్క శివసేనను కాపాడింది… అదే సందర్భంలో ప్రజాస్వామ్య రాజకీయ విలువలు కాపాడిన ఘన చరిత్ర సొంత చేసుకొని ..పొత్తు ఉన్న కూడా పెద్ద మెజారిటీ తో రాబోయే రోజుల్లో అధికారం కైవసం చేసుకొనే అవకాశం మెండుగా ఉంది.

డాక్టర్ జే. అజ్మతుల్లా ఖాన్
రాజకీయ విశ్లేషకులు