Home Page SliderTelangana

నేడే యంగ్ ఇండియా – ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గొప్ప ప్రారంభం

నేడు వివిధ జిల్లాల్లోని 28 ప్రాంతాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్యను అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన జరగనుంది. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న ఈ 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రెండవ దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని సి.ఎస్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గం లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.

శంకుస్థాపన జరగనున్న నియోజక వర్గాలు: కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్ చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట.