InternationalNews

పాక్ బాలిక… ఢిల్లీ డాక్టర్ వైద్యం.. వెల్లివిరిసిన మానవత్వం

Share with

దేశాలను దాటి ఒక వైద్యుడు చేసిన సాయం ఒక నిండు జీవితాన్ని నిలబెట్టింది.ఈ సంఘటన మానవత్వం యొక్క విలువలను పది రెట్లు పెంచిందని చెప్పవచ్చు.ఇంతకీ ఇటువంటి అద్భుత పరిణామానికి శ్రీకారం చుట్టిన ఆ వైద్యుడి గురించి,ఆయన సాయాన్ని అందుకుని జీవితాన్ని పొందిన ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాం. పాకిస్థాన్ ‌కు చెందిన అప్షీన్ గుల్ అనే అమ్మాయి ఒక అరుదైన సమస్యతో బాధపడుతుంది.సింధ్ ప్రావిన్స్‌కు చెందిన అఫ్షీన్ తన పది నెలల వయస్సులో ఉన్నప్పుడు ప్రమాదానికి గురికావడంతో మెడ వంకర తిరిగింది.దీనితో పాటు ఆమెకు సెరిబ్రల్ పాల్సీ అనే మరో వ్యాధి కూడా వచ్చింది.ఎంతమంది వైద్యులను సంప్రదించినప్పటికీ అది నయం కాలేదు.

ఈ నేపథ్యంలో అఫ్షీన్ దుస్థితి గురించి తెలుసుకున్న ఓ పాక్ నటుడు ఆమెకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టులు భారత దేశానికి చెందిన వైద్యుడు రాజగోపాలన్ దృష్టికి వచ్చాయి.దీంతో ఆయన వెంటనే బాలిక తల్లిదండ్రులను సంప్రదించారు.ఈ వ్యాధికి సంబంధించిన వైద్యం తాను చేస్తానని..అఫ్షీన్ తల్లిదండ్రులను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి పిలిపించారు. అక్కడ ఆయన అఫ్షీన్ కు ఉచితంగా చికిత్సను అందించారు.అయితే డాక్టర్ రాజగోపాలన్ చికిత్సతో కోలుకున్న అఫ్షీన్ ప్రస్తుతం కొత్త  జీవితాన్ని అస్వాదిస్తుంది. దీనిని  చూసిన వారంతా అందుకే వైద్యుడిని దేవునితో పోల్చారని..డాక్టర్ రాజగోపాలన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.