NationalNews

నేడు మరో సారి ఈడీ ముందుకు సోనియాగాంధీ

Share with

నేషనల్ హెరాల్డ్ ప్రతికకు చెందిన ఆర్ధిక లావాదేవీలకు సంబందించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేడు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారుల ఎదుట విచారణకు హజరు కానున్నారు. నిన్న సోనియాను దాదాపు 6 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఈరోజు కూడా హజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే తొలి దఫాలో 3 గంటలు, రెండో దఫాలో 6 గంటల పాటు విచారణ జరిపారు. మూడో దఫాగా బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారు. దీంతో మరికాసేపట్లో విచారణకు హాజరుకానున్నారు.

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ వద్ద ఈడీ అధికారులు తొలిసారి ఈ నెల 21వ తేదీన విచారణ జరిపిన విషయం తెల్సిందే. రెండు దఫాలుగా జరిపిన విచారణలో సోనియా వద్ద మొత్తం 9 గంటల పాటు విచారణ సాగింది. సోనియా గాంధీతో ఈడీ విచారణ పూర్తయ్యేవరకు ప్రియాంక గాంధీ తోడుగా ఉన్నారు ఈరోజు కూడా ప్రియాంక గాంధీ వెళ్లనున్నారు.

“యంగ్ ఇండియన్” సంస్థ కు, “నేషనల్ హెరాల్డ్” కు జరిగిన లావాదేవీల్లో సోనియా గాంధీ ప్రమేయాన్ని నిన్న ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలను, సోనియా గాంధీ ఇస్తున్న సమాధానాలతో ఈడీ అధికారులు పోల్చి చూస్తున్నట్లు సమాచారం. యంగ్ ఇండియన్ ప్రైవేటు సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజారిటీ షేర్లు ఉన్నట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ ” పత్రిక, “యంగ్ ఇండియన్” సంస్థల్లో రాహుల్ గాంధీ నిర్వహణ పాత్ర గురించి, అలాగే ఇతర కార్యవర్గ సభ్యుల బాధ్యతలు గురించి సోనియా గాంధీని నిన్న ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

నిన్న రాహుల్ గాంధీతో సహా, మొత్తం 57 మంది ఎంపీలను నిర్బంధం లోకి తీసుకున్న పోలీసులు, ఈడీ అధికారుల విచారణ పూర్తయ్యేంత వరకు కాంగ్రెస్ నేతలను విడుదల చేయలేదు. కాంగ్రెస్ నేతలపై పోలీసుల ముష్టిఘాతాల దృశ్యాలు వీడియో కెమెరాల్లో రికార్డ్ అవడం, ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఇదంతా కూడా, ప్రధాని మోడీ, అమిత్ షా ల ప్రమేయంతోనే జరిగిందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖార్గే విమర్శించారు. గత నెలలో రాహుల్ గాంధీని 5 రోజుల పాటు, సుమారు 50 గంటలు ఈడీ అధికారులు ప్రశ్నించారు

మరోవైపు, ఈ కేసులో రాహుల్, సోనియాల వద్ద ఈడీ అధికారులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంతో పాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతుంది.సోనియా విచారణ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నావారిని పోలీసులు అడ్డుకుంటూన్నారు. నిన్న ,స్వయంగా రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. ఈ రోజు కాంగ్రెస్ కు మద్దతుగా అన్ని విపక్షలు ఆందోళనలో పాల్గోనే అవకాశం ఉంది.ఈ మేరకు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటి కానున్నాయి.ఈ సమావేశంలో పార్లమెంట్ లోపల,బయట అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు

.