ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కోవిడ్ బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ప్రియాంక గాంధీ వాద్రా ట్వీటర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని, అన్ని నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రియాంక గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో ప్రియాంక గాంధీ వాద్రా కరోన బారినపడి కోలుకున్నారు. నెల వ్యవధిలోనే మరోసారి కరోనా బారిన పడ్డారు.
ఇదిలా ఉంటే.. నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తనకు మరోసారి కరోనా సోకినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు పాటించాలని మల్లిఖార్జున ఖర్గే సూచించారు. మరో వైపు… మల్లిఖార్జున ఖర్గే రెండురోజుల క్రితం రాజ్యసభ సమావేశాలకు హజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమంలో మల్లిఖార్జున ఖర్గే ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు,స్పీకర్ ఓం బిర్లా, ఎంపీలు, పలువురు ప్రముఖులు హజరయ్యారు. ఈ సమయంలో మల్లిఖార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.