మీడియా ముందుకు చైన్ స్నాచర్లు..
భాగ్యనగరంలో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్లని పోలీసులు నిందితులని అరెస్ట్ చేసిన విషయం తేలిసిందే. ఈ కేసులో ఇద్దరు చైన్ స్నాచర్లుని అరెస్ట్ చేశామని తెలిపిన పోలీసులు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ కేసులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు విశాంత్ , రాహుల్ గా గుర్తించామని తెలిపారు. వీరు ఈ నెల 22న గుల్బర్గా నుండి బైక్‌పై హైదరాబాద్‌కి వచ్చారని స్పష్టం చేశారు. కొండాపూర్ , మూసాపేట్ , ఆర్సిపురం లో ముగ్గురు మహిళల చైన్‌లు స్నాచింగ్ చేసిన నిందితులు. మూడు రోజుల వ్యవధిలనే మళ్లీ చైన్ స్నాచింగ్ మెదలు పెట్టిన నిందితులు 25న మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీలో ఇద్దరు బైక్ పై వచ్చి మహిళ గొలుసు లాకెళ్లారని చెప్పారు. అలాగే ఉషోదయ కాలనీలో మరో మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నం చేయగా కుదరకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయారని అన్నారు. ఈ కేసుపై అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చెప్పాట్టమని , చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక టీమ్స్ సిద్ధం చేసామన్నారు.
బాచుపల్లి నుండి లింగంపల్లి వరకు వాహనాలను తనిఖీలు చేసిన పోలీసులు.ఈ తనిఖీలలో భాగంగా పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానస్పద వ్యక్తులని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై కత్తితో దాడి చేసి అక్కడి నుండి పరారైన నిందితులు. ఈ సమాచారం తెలుసుకున్న రామచంద్రపురం పోలీసులు అప్రమత్తమై ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గాయపడ్డ యాదయ్యని హాస్పిటల్‌కి తరలించారు. నిందితులు ఇద్దరిని మధ్యాహ్నం 1 గంటకు మీడీయా ముందు ప్రవేశపెట్టనున్నరని సైబరాబాద్ సిపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.